Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి.. పవన్ ను కోరిన తెలంగాణ బీజేపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పవన్‌ను కోరారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వారికి చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్.డి.ఎ.లో జనసేన కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సావధానంగా చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బి.జె.పి. నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని, ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కి ..పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేతలను పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు పవన్‌తో మాట్లాడుతూ.. రాజకీయ గందరగోళం జరగకూడదనే ఉద్దేశ్యంతో 2018లో కొత్త రాష్ట్రంలో పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చేందుకే పోటీ నుంచి తప్పుకున్నామని, అయితే ఈసారి తప్పక పోటీ చేయాలని కోరారు. చాలా రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని నేతలు అభిప్రాయపడ్డారు. ఈసారి పదవీ విరమణ చేస్తే భవిష్యత్‌లో ప్రజల ముందుకు బలంగా వెళ్లడం కష్టమని, క్యాడర్‌కు నిరాశ తప్పదని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలు విన్న పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తానే అర్థం చేసుకోగలనని, అయితే తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, ప్రజా సైనికులు, వీర వనితల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందేనని పవన్ చెప్పినట్లు సమాచారం.
MLA Raja Singh: నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!