NTV Telugu Site icon

Gajendra Shekhawat: ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..

Shekavath

Shekavath

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకవత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానిది.. పర్యవేక్షణ మాది అని ఆయన తెలిపారు. అక్టోబర్ 19న సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రతిపాదనలు పంపింది.. వాటిని పరిశీలిస్తున్నాం.. త్వరలో క్యాబినెట్ లో చర్చిస్తాం.. ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నిర్మాణానికి కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నాయి.. పోలవరం నిర్వాసితుల పునరావాస అంశం రాష్ట్ర ప్రభుత్వం చూసుకొంటుంది అని గజేంద్ర సింగ్ షెకవత్ వెల్లడించారు.

Read Also: Virat Kohli: కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్

ఇక, జలవనరుల సమర్థ వినియోగానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అవసరమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. దేశంలో ప్రస్తుతం 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. సామర్థ్యాన్ని పలు పథకాల ద్వారా పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. నీటి పునర్‌ వినియోగానికి ఈ సదస్సు మంచి పరిష్కారాలు సూచించాలి.. జల వనరులను కాపాడుకుంటూ కొత్త యాజమాన్య పద్ధతులు కావాలని గజేంద్ర సింగ్ షెకవత్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఒప్పందాలు చేసుకున్నామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ వెల్లడించారు.