Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం అన్నారు.. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు.. వీటిపై ఆర్‌ఎన్‌ఐఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో ఈ పరిస్థితులపై చర్చిస్తాం అన్నారు..
Read Also: Ambedkar statue: రేపు సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. సాంప్రదాయ పద్దతిలో కార్యక్రమం
మరోవైపు.. విశాఖ స్టీల్‌కు సంబంధించిన బిడ్డింగ్‌లో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ పాల్గొనేందుకు సిద్ధం అవుతూ.. తన టీమ్‌ను కూడా స్టీల్‌కు ప్లాంట్ పంపింది.. ఇక, ఈ పరిణామాలపై స్పందించిన ఫగ్గన్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమే నని కొట్టిపారేశారు. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి.. ప్రైవేటీకరణ అనేది సుదీర్ఘ ప్రక్రియ అయినప్పట్టికీ.. తాజాగా కేంద్ర ఉక్కశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారాయి.
