NTV Telugu Site icon

Bishweswar Tudu : రోజ్ గార్ మేళా‌లో 200 మందికి నియామక పత్రాలు అందజేత

Bishweswar Tudu

Bishweswar Tudu

రోజ్ గార్ మేళా‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 200 మందికి నియామక పత్రాలను కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు అందజేశారు. రోజ్ గార్ మేళా‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన సుమారు 200 మందికి సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్ సెంటర్, చాంద్రయణగుట్టలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి, గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందడుగుగా ఉన్నదని అన్నారు.
Also Read : Minister Mallareddy IT Raids : మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2కోట్లు సీజ్‌.. కొనసాగుతున్న సోదాలు

రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను పెంపొందింపచేయడం లో ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది, అంతే కాకుండా యువతీ యువకులకు వారి సశక్తీకరణతో పాటు దేశాభివృద్ధిలో వారు పాలుపంచుకోవడానికి కూడాను సార్థక అవకాశాలను కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబరు లో జరిగిన రోజ్ గార్ మేళా లో, కొత్తగా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న 75,000 మంది కి నియామక లేఖల ను అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు , సి.ఆర్.పి.ఎఫ్ సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ