Minister Mallareddy IT Raids : మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2కోట్లు సీజ్.. కొనసాగుతున్న సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లడు రాజశేఖర్‌రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి ఇళ్లలోనూ ఐటీ శాఖ అధికారులు తనీఖీలు చేస్తు్న్నారు. అలాగే మల్లారెడ్డి సొదరుగు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు 14 విద్యాసంస్థల కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఈ ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో 2 కోట్లు స్వాధీనం చేసినట్లు తెలుస్తోంది.
Also Read
మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని గుర్తించారు ఐటీ అధికారులు. ఇదిలా ఉంటే.. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్‌లను సైతం సీజ్ చేసి సోదాలు చేస్తున్నారు. అయితే.. మల్లారెడ్డి సోదరుడు ఇంట్లో లాకర్‌ను గుర్తించిన ఐటీ అధికారులు దాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బాలనగర్‌లోని రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!