Bhagwanth Khuba: విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. ఎవరికి ఉపయోగపడే పథకాలు వారికి అందేలా చేసిన వ్యక్తి ప్రధాని మోడీ అంటూ కేంద్ర మంత్రి వెల్లడించారు.
Also Read: Kakani Govardhan Reddy: టీడీపీ నేతలు కూడా చంద్రబాబును పట్టించుకోవట్లేదు..
ప్రధాని మోడీ తీసుకొచ్చిన పథకాలతో భారత ప్రజలందరూ లబ్ధి పొందుతున్నారన్నారు. పేదలను బీపీఎల్‌ను దాటి పైకి వచ్చేలా చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. తలసరి ఆదాయం 1.5 లక్షలు చేసే దిశగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో భారత ఆర్ధిక వ్యవస్ధ 10వ స్ధానంలో ఉండేదని.. ఈ 9 సంవత్సరాలలో 5వ స్ధానానికి భారత ఆర్ధిక వ్యవస్ధ వచ్చిందన్నారు. ప్రపంచంలో భారత దేశ గౌరవం పెరుగుతోందని.. భారతదేశాన్ని విశ్వగురు అవ్వకుండా ఎవరూ ఆపలేరన్నారు. విశ్వకర్మ సమాజం చేసే వస్తువుల డిమాండ్ తగ్గిపోయి బలహీనం కావడంతో వారికి చేయూతనివ్వాలని మోడీ ఆలోచించారన్నారు. బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించడాని ఒక పథకాన్ని మోడీ తయారు చేశారన్నారు.