P.hd. Admissions: వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదు.. ఇక నెట్ స్కోర్ తోనే పిహెచ్‌డి ప్రవేశాలన్న యూజీసీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అలాగే ఉన్నత విద్యా సంస్థలలో పిహెచ్‌డి కోసం ప్రవేశాలకు గాను యుజిసి నెట్ స్కోర్ సరిపోతుందని తాజాగా యుజిసి స్పష్టం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పిహెచ్‌డి ప్రవేశాలను వేరువేరుగా నిర్వహించే ప్రవేశాల పరీక్షల అవసరం లేకుండా రాబోయే విద్య సంవత్సరం నుండి పిహెచ్‌డి ప్రవేశాలకు కేవలం నెట్ స్కోర్ లను ఉపయోగించనున్నట్లు కమిషన్ తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది.
Also Read: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
మొదటిసారి జూన్ నెలలో నిర్వహిస్తుండగా.. మరోసారి డిసెంబర్ నెలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలలో సాధించే స్కోరును అనుసరించి ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF ఇవ్వడానికి అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడానికి ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా యూజీసీ పరీక్షల నిబంధనలను మరోసారి సమీక్షించడానికి కమిషన్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వీరి సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి పిహెచ్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాంలో ప్రవేశానికి గాను ఆయా సబ్జెక్టులలో నెట్ లో సాధించిన స్కోరును ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..
ఇక వచ్చే విద్యా సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్‌డి కోర్సులలో ప్రవేశాలకు గాను నెట్ (NET ) స్కోరు ఉపయోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే కొన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్‌డి కోర్సులలో ప్రవేశాలకు గాను విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయం విద్యార్థులకు అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అలాగే ఐఐటీల వంటి ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే ప్రత్యేక పరీక్షల అవసరాన్ని ఈ నిర్ణయంతో సరళం చేస్తుందని యుజిసి భావిస్తోంది. పిహెచ్‌డి అడ్మిషన్ ప్రక్రియను గాను అభివృద్ధికరించడంలో, అలాగే అభ్యర్థులకు అవకాశాలను పెంచడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!