ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్.. అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ రెపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేత అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
అలాగే, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు చివరి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు తిరుమలకు అమిత్ షా రానున్నారు. కాగా, ప్రత్యేక విమానంలో వస్తున్న అమిత్ షా.. నేరుగా వకుళ మాత గెస్ట్ హౌస్ కు చేరుకోని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు తిరిగి వెళ్లిపోతారు. అయితే, ఈ పర్యటనలో ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్ తో భేటీ ఉంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.