Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రేపు(శుక్రవారం) ఉదయం అమిత్‌షా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి, తిరుమలలో ఆయన నివసించే అతిథిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలుమార్లు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం.
Read Also: CM YS Jagan: ఐదేళ్ల క్రితం ఇదే రోజున అధికారంలోకి వచ్చాం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా.. బీజేపీ,టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. ఈ రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు.