NTV Telugu Site icon

Dharmendra Pradhan: పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి

Education Minister

Education Minister

Dharmendra Pradhan: యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇటీవలి తీవ్ర విమర్శలకు దారి తీశాయి.

Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీతో పాటు ప‌లు అంశాల‌పై చర్చ

కాగా, గురువారం నాడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఎ) యొక్క “సంస్థాగత వైఫల్యం” అన్నారు. కేంద్ర సర్కార్ వేసిన ఈ కమిటీ ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతా ప్రోటోకాల్‌లను మరింత మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందన్నారు. జీరో-ఎర్రర్ టెస్టింగ్ మాది.. నిబద్ధతతో కూడిన ప్యానెల్‌ను త్వరలో తుది నివేదిక ఇస్తుంది.. ఈ కమిటీలో నిపుణులు ఉన్నారు.. వారే అన్ని అంశాలపై లోతైన విచారణ చేసి రిపోర్ట్ అందజేస్తుందన్నారు. డార్క్‌నెట్‌లో పేపర్ లీక్ అయింది.. అలాగే, టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతుందని మాకు రుజువులు దొరికాయి.. ఈ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.