Site icon NTV Telugu

Cabinet Meeting: రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం

Modi

Modi

రేపు (మంగళవారం) ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశం జరుగుతుందని వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు జరగనున్న.. మంత్రి మండలి సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు యూనియన్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ రెండు కీలక సమావేశాలు ప్రధానమంత్రి 7, లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో జరగనున్నాయి.

Read Also: PM Modi: కోటి దీపోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం: ప్రధాని మోడీ

అయితే సమావేశంలో దేనిపై చర్చిస్తారనేది తెలియరాలేదు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఏదైనా పెద్ద ఎత్తుగడను ప్లాన్ చేస్తుందా అనే ఊహాగానాలకు దారితీసింది. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది రోజుల ముందు కేబినెట్ మంత్రులు ప్రధానిని కలవనున్నారు.

Read Also: Mahendragiri Varahi: సుమంత్ మరోసారి థ్రిల్లర్ తో వస్తున్నాడు..

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి చర్చించనున్నారు. కాగా.. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇంతకుముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మధ్య న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ హాల్‌లో సెప్టెంబర్ 18న చివరి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 18న ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 22 వరకు కొనసాగాయి. పార్లమెంటు కార్యకలాపాలను కొత్త భవనానికి తరలించడానికి రెండ్రోజుల ముందు కేబినెట్ సమావేశం జరిగింది.

Exit mobile version