Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ (CCEA) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.77,101 కోట్లకు పైగా కేటాయించింది. ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటుకు రూ.3,230 కోట్లు, నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు రూ.2,390 కోట్లు, రబీ 2026-27 సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370 కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు (Micro Units) క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు, స్టాండ్ అప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.4,111 కోట్లు కేటాయించింది.
ముఖ్యంగా ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాల్లో సుమారు 1,78,509 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 3,230 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారతదేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రపంచానికి సముచిత రీతిలో చాటిచెప్పేలా ఈ మ్యూజియం రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టును చారిత్రక భవనాల వారసత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా ఆధునిక మ్యూజియంగా మార్చనున్నారు. 2026-27 నుంచి 2030-31 వరకు దశలవారీగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రణాళిక రూపొందించగా, 2027 ద్వితీయార్థంలో తొలి గ్యాలరీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రదర్శించడం కోసం ఇప్పటికే నేషనల్ మ్యూజియం, కేంద్ర సాంస్కృతిక శాఖ మ్యూజియంలతో పాటు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కి చెందిన 52 ప్రదేశాల మ్యూజియంల నుంచి దాదాపు 18 లక్షల చారిత్రక వస్తువులను సేకరించి గుర్తించారు.
Also Read
- Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
- Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
ఈ మ్యూజియంలో ఆర్కిటెక్చర్, నగర నిర్మాణాలు, గణితం, ఖగోళ శాస్త్రాలపై ప్రత్యేక గ్యాలరీలు కొలువుదీరనున్నాయి. దాంతో పాటు భారతీయ భాషలు, లిపులు, ఆధ్యాత్మికత, విశ్వాస సంప్రదాయాలపై ప్రదర్శనలతో పాటు భారత్-ప్రపంచ దేశాల మధ్య కొనసాగిన వాణిజ్యం, ఆలోచనల అనుసంధానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్‌తో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ, ఏడాదికి కోటి మంది సందర్శకులకు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నారు. టికెట్లు, గైడెడ్ టూర్లు, డిజిటల్ అనుభవాలు, వివిధ ఈవెంట్ల నిర్వహణ ద్వారా ఈ ప్రాజెక్టుకు ఆదాయ సమీకరణ జరగనుంది. మ్యూజియం నిర్మాణం, నిర్వహణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా కళాకారులు, శిల్పులు, పరిశోధకులు, డిజైనర్లు, పర్యాటక రంగానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. అంతేకాకుండా దేశీయంగా మ్యూజియం ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పిస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’కు పెద్దపీట వేయనున్నారు. భారత నాగరికతా వైభవాన్ని సగర్వంగా చాటిచెప్పే ఈ యుగే యుగీన్ భారత్ మ్యూజియం రాబోయే రోజుల్లో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మరోవైపు, నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో ప్రయాణికులకు కేంద్రం కేబినెట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు మెట్రో పొడిగించనున్నారు. మొత్తం 8.5 కిలోమీటర్ల మేర ఆక్వా లైన్ మెట్రో కారిడార్ విస్తరణ జరగనుంది. కొత్తగా ఐదు మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో మెట్రో విస్తరణతో వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
తాజావార్తలు
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!