Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్నారు. భారత లక్ష్యాలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నామని చెప్పారు.. ఈ బడ్జెట్ ‘యువశక్తి బడ్జెట్’ అని ప్రస్తావించారు. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కర్తవ్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు.. కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం అని పార్లమెంట్ వేదికగా ఆర్థిక మంత్రి తెలిపారు.. ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించాం.. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లు వసూళ్లు చేసినట్లు వెల్లడించారు.. ఎకానమీలో నిలకడ వచ్చిందని చెప్పారు.. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉందని స్పష్టం చేశారు.
READ MORE: కొత్త ‘క్రిస్టల్ పింక్’ కలర్‌లో OPPO Reno15 Pro Mini లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
కాగా.. ఈ రోజు దేశ రాజకీయ-ఆర్థిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వతంత్ర భారతదేశంలోనే తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కావడం విశేషం. అందుకే ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ బడ్జెట్ 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆ ప్రభావం భారత్‌పైనా ఎలా పడుతుందన్న చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతోంది.
READ MORE: Ambati Arrest: నల్లపాడు పీఎస్కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు.. అంబటి అరెస్ట్ ను ఖండిస్తున్నాం..
