Union Budget 2025: రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో.. బడ్జెట్ అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
* KCC ద్వారా లోన్ల పెంపు:
కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రైతులకు అందించే లోన్ల పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కీలకమైన నిర్ణయంగా భావించబడుతోంది.
Also Read
- Gulab Lassi Recipe: హీట్‌కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
- భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
* స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు
స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులను రూ. 30,000తో అందించనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న వ్యాపారాలకు పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది.
* బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
బొమ్మల తయారీ రంగంలో ప్రజలకు సహాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
* ఐఐటీ పాట్నా విస్తరణ
భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ పాట్నాను విస్తరించడానికి నిధులు కేటాయించబడినట్లు ప్రకటించారు.
* రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణాలు
రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయాల కోసం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు.
* 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు, ఇది దేశంలోని వివిధ రంగాలకు కీలకంగా ఉంటుంది.
* గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా మరియు గుర్తింపు కార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా వారికి మరింత మద్దతు లభించనుంది.
* పీఎం ధన్‌ధాన్య యోజన
MSME రంగంలోని 7.5 కోట్ల మందికి సాయం అందించడానికి పీఎం ధన్‌ధాన్య యోజనను అమలు చేయనున్నారు.
* ప్రయోగాత్మకంగా పీఎం ‘ధన్‌ధాన్య’ యోజన
పీఎం ధన్‌ధాన్య యోజనను మొదటగా 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
* మఖనా ఉత్పత్తి పెంపు
బిహార్‌లోని మఖనా రైతులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, ఉత్పత్తి పెంచేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.
* విద్యారంగంలో ఏఐ వినియోగం
విద్యారంగంలో ఆధునిక టెక్నాలజీలను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించడం ప్రారంభించనున్నారు.
* ఐఐటీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు
వచ్చే 10 సంవత్సరాలలో ఐఐటీ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
* అంగన్‌వాడీలకు కొత్త హంగులు
అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వృద్ధి కోసం నిధులు కేటాయించనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
-
Google Search Big Update: గూగుల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. కొత్త ఏఐ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
Gulab Lassi Recipe: హీట్‌కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?