NTV Telugu Site icon

Union Bank Jobs 2024: యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

Bank

Bank

బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 606 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

మొత్తం 606 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లను బట్టి.. వీటిని జేఎంజీఎస్‌-1, ఎంఎంజీఎస్‌-2,3; ఎస్‌ఎంజీఎస్‌-4 గ్రేడ్‌లుగా వర్గీకరించారు..

అర్హతలు..

సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ తదితర అర్హతలతోపాటు అనుభవం ఉండాలి..

వయసు..

ఫిబ్రవరి 1, 2024నాటికి చీఫ్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు 30-45 ఏళ్లు; ఐటీ సీనియర్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు 28 -38 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌ (సీఏ, రిస్క్‌), మేనేజర్‌ పోస్ట్‌లకు 25-35 ఏళ్లు ఒక్కో పోస్టుకు ఒక్కో ఏజ్ లిమిట్..

ఎంపిక ప్రక్రియ..

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి..

జీతం..

చీఫ్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు ఎస్‌ఎంజీఎస్‌-4 హోదాలో రూ.76,010-రూ.­89,890; సీనియర్‌ మేనేజర్‌ పోస్ట్‌లకు ఎంఎంజీఎస్‌-3 హోదాలో రూ. 63,840-రూ.78,230 ఉంటుంది..

ముఖ్యమైన సమాచారం..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024,ఫిబ్రవరి 23
రాత పరీక్ష తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in/english/ ఏదైనా సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు..