NTV Telugu Site icon

Vijayawada Crime: బెజవాడలో దారుణం.. రూ.100 ఇవ్వలేదని కత్తితో దాడి

Crime

Crime

Vijayawada Crime: విజయవాడలో దారుణం వెలుగు చూసింది.. వంద రూపాయలు ఇవ్వలేదని యువకుడుపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఈ ఘటన జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాచవరంలోని ఓ సెలూన్ లో పనిచేస్తున్న భోగిల హరిప్రసాద్.. నిన్న రాత్రి 11 గంటలకు నడిచి వెళ్తుండగా మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు అతడిని అడ్డుకున్నారు.. 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అయితే, వంద రూపాయాలు ఇచ్చేందుకు నిరాకరించాడు హరిప్రసాద్‌.. దీంతో.. ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డారు.. గాయాలపాలైన హరిప్రసాద్‌ను జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. నిజంగా వంద రూపాయల కోసమే కత్తితో దాడి చేశారు.. ఈ దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, గతంలోనూ రూ.5, రూ.10కి కూడా దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి.. ఏదైమానై.. వంద రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిపై దాడి ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది.

Read Also: Gangster Murdered in Tihar Jail: తీహార్‌ జైల్లో గ్యాంగ్‌ వార్‌.. గ్యాంగ్‌స్టర్‌ మృతి

Show comments