NTV Telugu Site icon

Seema Haider: సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు.. విచారిస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్

Seema

Seema

సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీమా.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని సీమా వెల్లడించింది. సీమా స్టేట్మెంట్లు నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్ ను విచారించారు.

Lifestyle : పచ్చని కాపురానికి పనికొచ్చే సూత్రాలు..అవేంటంటే?

మరోవైపు సచిన్ తో ప్రేమ విషయాలకు సంబంధించి.. సీమా హైదర్ అన్నీ చెప్పింది. 2019లో తన భర్త గులాం హైదర్ నుండి దూరంగా ఉన్నప్పుడు.. అదే సమయంలో సచిన్ మీనాతో స్నేహం ఏర్పడిందని చెప్పింది. తనకు సచిన్ అంటే చాలా ఇష్టమని, అందుకే పాకిస్థాన్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, ఇప్పుడు నోయిడాకు వచ్చానని సీమా హైదర్ చెప్పింది. యూపీ ఏటీఎస్‌ విచారణలో సీమా హైదర్‌ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. పాకిస్థాన్‌ సైన్యంలో తన బంధువులు ఉండడం.. అంతగా చదువుకోకపోయినా హిందీ, ఇంగ్లీష్‌ లో మాట్లాడడం.. నేపాల్‌ నుంచి అక్రమంగా భారత్‌ రావడం ఇలా అన్ని ప్రశ్నలపై సీమా తప్పించుకునే సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా సచిన్ సీమకు చెందిన నకిలీ ఆధార్ కార్డులను తయారు చేశాడని.. వారిద్దరూ బస చేసిన నేపాల్‌లోని హోటల్‌లో తప్పుడు పేరు మరియు చిరునామాను ఇచ్చాడని కూడా తేలింది. దీంతో విచారణలో ఇరువురు విషయాలు దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tamannah : మరోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న తమన్నా..?

అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా పాకిస్థాన్‌కు తిరిగి పంపిస్తారా అనే విషయాలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వారిద్దరిని విచారించిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తన నివేదికను సిద్ధం చేసింది. సీమా, సచిన్‌లను సుమారు 20 గంటలపాటు విచారించిన తర్వాత ఏటీఎస్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు తిరిగి పంపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై యుపి పోలీసు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల విషయమని, తగిన ఆధారాలు లభించే వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.