Site icon NTV Telugu

Viral News: గుర్రపు స్వారీ చేస్తున్న వరుడికి అనుకోని ప్రమాదం.. వీడియో వైరల్

Viral News

Viral News

పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. పెళ్లికొడుకును, పెళ్లి కూతురును ఊరేగించడం, పెళ్లి మండపం దగ్గరం తీసుకెళ్లడం కార్లలో తీసుకెళ్తూ ఉంటారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. బాగా రిచ్ గా ఉండాలని వధూవరులను గుర్రపు రథాల్లో ఊరేగిస్తున్నారు. మాములుగా అయితే.. గుర్రాలకు ముందుగా శిక్షణ ఇస్తుంటారు.. అలాంటి వాటినే ఈ కార్యక్రమాల కోసం వాడుతారు. అయితే ఒక్కోసారి.. గుర్రాలు సౌండ్ కు, మనుషులను చూసి భయపడిపోతాయి. అప్పుడు మన కంట్రోల్ లో ఉండవు. ఎటు పడితే అటు పరుగెత్తుతాయి. తాజాగా.. అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Read Also: KU Mohanan: నాకు ఆ పిచ్చి లేదు.. విజయ్ పర్ఫార్మెన్స్‌లో డ్రామా ఉండదు.. ఫ్యామిలీ స్టార్ సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూ

పెళ్లి మండపానికి గుర్రపు రథంలో వెళ్తున్న వరుడికి అనుకోని ప్రమాదం ఎదురైంది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. ఆస్పత్రి బెడ్ ఎక్కాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇన్ స్టా నుంచి @the_professor_13_15 అనే ఐడీతో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వరుడు గుర్రపు రథం నుంచి పడిపోవడం చూడవచ్చు. పెళ్లి మండపానికి అని బయల్దేరిన వరుడు.. అతనితో పాటు కొందరు ప్రమాదవశాత్తు రథంపై నుంచి కిందపడిపోయారు.

Read Also: Shubman Gill: శుభ్మన్‌ గిల్‌కు భారీగా ఫైన్.. ఎందుకో తెలుసా..?

గుర్రపు రథంలో వస్తున్న వారు.. ఓ సర్కిల్ దగ్గరికి రాగానే అవి భయపడిపోయాయి. ఒక గుర్రం మరొక గుర్రాన్ని లాగి గుంతలో పడేశాయి. గుర్రం రథంలో కూర్చున్న వారు తాడుతో ఎంత లాగినా వినకుండా కాలువలోకి పడేసింది. దీంతో ఒక్కసారిగా గుర్రపు రథం కూడా కాలువలో పడిపోయింది. ఈ వీడియోలో చూస్తే.. దానిపై కూర్చున్న వారికి తీవ్రగాయాలు అయి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే.. ఈ వీడియోను 8 లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version