KU Mohanan: నాకు ఆ పిచ్చి లేదు.. విజయ్ పర్ఫార్మెన్స్‌లో డ్రామా ఉండదు.. ఫ్యామిలీ స్టార్ సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KU Mohanan Interview for Family Star Movie: ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన కేయూ మోహనన్ డాన్, తలాష్, అందధూన్ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ తో పాటు తెలుగులో మహేశ్ బాబు మహర్షి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. కేయూ మోహనన్ తెలుగులో హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”కి పని చేశారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేశారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్.
– సినిమాటోగ్రఫీ గురించి నేను ఫిలిం స్కూల్ లో నేర్చుకున్నా, కెమెరా విషయంలో నాదంతా ఫార్మల్ లెర్నింగ్, వరల్డ్ సినిమా చూడటం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నా. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలు చూస్తున్నా, మనవన్నీ బేసిక్ గా కమర్షియల్, లార్జర్ దేన్ లైఫ్ మూవీస్. అందుకే సినిమాటోగ్రఫీ విషయంలో న్యాచురాలిటీకి కొంత ఎక్కువగా విజువల్స్ ఉండాలని కోరుకుంటాం. సినిమాటోగ్రఫీ ఒక స్కిల్ కాబట్టి అందులో ఒక ఈస్తటిక్ సెన్స్, విజువల్ సెన్స్ ఉంటుంది. అది ప్రాజెక్ట్ ను బట్టి, సినిమాను బట్టి అప్లై చేస్తూ ఉంటాం. సినిమాలకు కొత్త ఎక్విప్ మెంట్ వాడటం అనేది అవసరం ఉంటేనే చేస్తా, ఈ కొత్త లెన్స్ వాడాను, ఈ కొత్త కెమెరా తెచ్చాం అని చెప్పుకునేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఆ సినిమాకు ఎలాంటి విజువల్స్ కావాలో, అందుకు ఏ పరికరాలు అవసరం అవుతాయో అవి మాత్రమే తీసుకోమని చెబుతా.
Also Read
– ఎస్వీసీ సంస్థలో గతంలో మహర్షి చేశా, ఈ సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. విజయ్ దేవరకొండ న్యాచురల్ యాక్టర్. ఆయన నటనలో పెద్ద డ్రామా ఉండదు, విజయ్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం.
– ఫ్యామిలీ స్టార్ అనేది ఒక బ్యూటిఫుల్ మూవీ. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ, అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది గుడ్ మెసేజ్ తో ఉంటుంది. కాలనీ సెట్ లో షూటింగ్ చేశాం, కథ, క్యారెక్టర్స్ ఎంత న్యాచురల్ గా ఉన్నాయో దాన్ని రిఫ్లెక్ట్ చేసేలా విజువల్స్ తెరకెక్కించాను. డ్రోన్ షాట్స్ ఉండవు, అవసరం లేని విజువల్ షాట్స్ ఏవీ ఫ్యామిలీ స్టార్ కు తీయలేదు. లైటింగ్ కూడా సహజంగా చేశాం. కానీ సినిమా చూస్తున్నప్పుడు విజువల్స్ ఎంత అందంగా ఉండాలో అంతే బ్యూటిఫుల్ గా, ఒక మిడిల్ క్లాస్ ఇల్లు తెరపై చూస్తుంటే..ఇది మన ఇంటిలా ఉంది అనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్ ఈ సినిమా నేపథ్యాన్ని సింపుల్ సెటప్ లో క్రియేట్ చేశాడు. విజయ్, మృణాల్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ కాబట్టి ఆర్టిస్టులు, ఇతర క్రూ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం అన్నారు.
– మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పే సినిమా ఫ్యామిలీ స్టార్. ఇండియా మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటం అనేది జరగడం లేదు, ఇలాంటి టైమ్ లో మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి డిస్కస్ చేసే సినిమా ఇది. ఇండియన్ ఫ్యామిలీ స్టోరీతో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. దర్శకుడు పరశురామ్ స్పష్టమైన ఆలోచనలతో ఈ సినిమాను రూపొందించారు. నా వర్కింగ్ స్టైల్ తో పరశురామ్ హ్యాపీగా ఫీలయ్యాడు, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!