Rahul Gandhi: బుధవారం రోజు, 2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే కొందరు వ్యక్తులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించారు. విజిటర్ల రూపంలో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్‌లోకి దూసుకెళ్లి, పొగతో కూడిన బాంబుల్ని పేల్చారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది.
అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. భద్రతా ఉల్లంఘనకు నిరుద్యోగం కారణమని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ విధానాల వల్ల దేశంలోని పౌరులకు ఉపాధి లభించడం లేదని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం భద్రతా ఉల్లంఘనకు కారణమైందని శనివారం మీడియాతో చెప్పారు. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమే అని అన్నారు.
Read Also: Bhogapuram Green Field Airport: 2025లో అందుబాటులోకి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్!
మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఆయన కేవలం మీడియాతో మాత్రమే మాట్లాడుతారు.. కానీ సభలో ఈ విషయంపై ప్రకటన చేయరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. భద్రతా ఉల్లంఘన కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నలుగురిని పార్లమెంట్ వద్దే అరెస్ట్ చేయగా.. ఈ కుట్రకు కీలక సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసుల మందు లొంగిపోయాడు. తాజాగా ఈ కేసులో మరో నిందితుడు మహేష్ కుమావత్‌ని ఈ రోజు అదుపులోకి తీసుకు్నారు.