ఐసీసీ విమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అలాగే ఈ టీమ్‌లో సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ విమానాశ్రయంలో సూపర్ వెల్‌కమ్ దక్కింది. టోర్నీ ముగిసిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన త్రిషకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ టోర్నీలో త్రిషతో పాటు ఓ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆడిన హైదరాబాద్ క్రీడాకారిణి యశశ్రీ, జట్టుకు ఫిట్ నెస్ ట్రెయినర్‌గా వ్యవహరించిన శాలినీలకు కూడా మంత్రి, క్రీడాశాఖ అధికారులు పుప్ఫగుచ్ఛాలు అందించారు.
Also Read: WhatsApp: వాట్సాప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించింది. క్రికెటర్లు, వారి తల్లిదండ్రులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. త్రిషకు స్వాగతం పలికేందుకు అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
త్రిష, యశశ్రీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్
త్రిష, యశశ్రీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్