Site icon NTV Telugu

Jharkhand: రిటైర్డ్ టీచర్‌ బాగోతం.. చెప్పుల దండలతో ఊరేగింపు

Rape

Rape

సమాజంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు కఠినశిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధులు ఆగడం లేదు. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చక్రధరపూర్‌లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ పదవికి, సామాజిక, కుటుంబ సంబంధాలకు మచ్చ తెచ్చాడు. 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన సొంత మైనర్ మేనకోడలిపై కామ కోరికలు తీర్చుకుని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. కాగా.. ఈ వ్యవహారం ప్రజలకు తెలవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై నిందితుడు రిటైర్డ్ టీచర్‌కు చెప్పుల దండలు వేసి ఊరంతా ఊరేగించారు.

కాగా.. రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన సొంత 17 ఏళ్ల మేనకోడలిని ఇంటి పని చేయడం కోసమని తనను తీసుకున్నాడు. అందుకు తన మేనకోడలికి డబ్బులు ఇచ్చేవాడు. అయితే.. ఆదివారం ఉదయం బాలిక తన ఇంట్లో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. తనకు ఏం జరిగిందో బాలిక కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే చక్రధర్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న మైనర్ బాలికను డాక్టర్ పరీక్షించి.. 8 నెలల గర్భవతి అని చెప్పారు. కాగా.. ఈ విషయం వినగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా.. బాలిక స్పృహలో నుంచి బయటకు రాగానే.. గర్భం దాల్చిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు.

PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..

కాగా.. బాలిక భయపడి చాలా సేపటి తర్వాత మాట్లాడింది. తన మామయ్య తనతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకుని గర్భవతిని చేశాడని చెప్పింది. ఒక్కసారి కాదు, చాలాసార్లు శారీరకంగా వాడుకున్నట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తన పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మామ తనపై అత్యాచారం చేసేవాడని బాలిక చెప్పింది. ప్రజలకు ఈ విషయం తెలిస్తే.. ఏమవుతుందోనని బాలిక ఎవరికి చెప్పలేకపోయింది. నిందితుడు కూడా బాలిక గర్భం దాల్చుతుందేమోనని.. అబార్షన్ మాత్రలు ఇచ్చేవాడు. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో గర్భం దాల్చింది.

బాలికపై శారీరక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిపై గ్రామ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. అతని ఇంటికి చేరుకుని.. ఇంట్లో నుండి బయటకు లాగి చెప్పుల దండ వేసి గ్రామంలో తిప్పారు. అంతేకాకుండా.. తీవ్రంగా చితకబాదారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మరోవైపు.. మైనర్ బాలికకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Exit mobile version