గతంలో కేవలం పెద్ద వయస్సు ఉన్న వారికి మాత్రమే గుండెనొప్పి వచ్చేది కానీ.. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి హార్ట్ ఎటాక్ వస్తుంది. మారుతున్న మన ఆహారాపు అలవాట్లతో.. ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎవరికి ఎప్పుడు గుండెనొప్పి వస్తుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే.. తమకు ఇష్టమైన వాళ్లు మరణిస్తే వాళ్ల గుర్తులను అప్పుడే మార్చిపోలేకపోతాం.. అలాంటిది.. ఓ వ్యక్తి తన కూతురిని ఇచ్చిన అల్లుడు గుండెనొప్పితో మరణించడంతో తీవ్ర బాధ పడ్డాడు. అల్లుడి మృతదేహాన్ని చూసి అక్కడే ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో జరిగింది.
Read Also: TFJA: ఆ విషయంలో సినీ సెలబ్రెటీలకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
అయితే, వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలిసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. మామ, అల్లుడు మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఒకే ఇంట్లో అల్లుడు, మామ మరణించడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇరువురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Read Also: Brijbhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్.. ఈ నెల 20న మళ్లీ విచారణ