NTV Telugu Site icon

Assam: భార్య మృతి తట్టుకోలేక ఐపీఎస్ ఆత్మహత్య..

Ips

Ips

భార్య చనిపోవడంతో భర్త, ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అస్సాం డీజీపీ జీపీ సింగ్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. ఆయన తన పోస్ట్‌లో.. ‘ఇది దురదృష్టకర సంఘటన. అస్సాం హోం, పొలిటికల్ సెక్రటరీ షిలాదిత్య చెటియా ఈరోజు సాయంత్రం ప్రాణాలు తీసుకున్నారు. అతను 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్య మరణించిన నిమిషాల తర్వాత అతను ఈ చర్య తీసుకున్నాడు. ఈరోజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు” అని తెలిపారు. ఈ ఘటనతో ఆ పోలీసు కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

Supeme Court: ఈ తేదీ నుండి సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్..

మరోవైపు.. జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది తన భార్య గొంతు కోసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-8లో ఉన్న ఆయన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆ దంపతులు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాకు చెందినవారు. కాగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

AP: ఏపీలో పాత పథకాలకు కొత్తపేర్లు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరూ 2008లో పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో.. మృతుడు తండ్రి ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో SECL ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే.. తాను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో.. మూడు నెలల క్రితమే తండ్రి మరణంతో కారుణ్య నియామకం పొందారు. కాగా.. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి చేరుకున్న సిఐఎస్ఎఫ్ నాగరాజు.. ఈ ఘతాకానికి పాల్పడ్డాడు.