NTV Telugu Site icon

Pakistan: పెరిగిన కిడ్నాప్‌లు, బలవంతపు పెళ్లిళ్లు.. చర్యలు చేపట్టాలని ఐరాస సూచన

Pak

Pak

Pakistan: పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీలకు చెందిన మైనర్ మహిళల అపహరణలు, బలవంతపు వివాహాలు, మతమార్పిడుల సంఖ్య పెరగడంపై ఐక్యరాజ్యసమితి సోమవారం అప్రమత్తం చేసింది. ఈ నేరాలను నిరోధించడానికి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణమే కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి కార్యాలయం మానవ హక్కుల హైకమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్యలను నిష్పక్షపాతంగా, దేశీయ చట్టం, అంతర్జాతీయ మానవ హక్కుల కట్టుబాట్లకు అనుగుణంగా నిరోధించడానికి.. క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు. 13 ఏళ్ల వయస్సులో ఉన్న ఆ బాలికలను వారి కుటుంబాల నుంచి కిడ్నాప్ చేయడం, వారి ఇళ్లకు దూరంగా ఉన్న ప్రాంతాలకు అక్రమ రవాణా చేయడం, కొన్నిసార్లు వారి కంటే రెట్టింపు వయస్సు ఉన్న పురుషులను వివాహం చేసుకోవడం, ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేయడం వంటివి వినడం తమకు చాలా బాధ కలిగించిందన్నారు.

ఇలాంటి వివాహాలు, మతమార్పిడులు హింసాత్మకంగా మారడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు తెలిపారు. బలవంతపు మతమార్పిడులను నిషేధించే, మతపరమైన మైనారిటీలను రక్షించే చట్టాన్ని ఆమోదించడానికి పాకిస్తాన్ గతంలో చేసిన ప్రయత్నాలను గమనించిన నిపుణులు.. బాధితులు, వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ వివాహాలు, మార్పిడులు మతపరమైన అధికారుల ప్రమేయం, భద్రతా బలగాలు, న్యాయ వ్యవస్థ ప్రమేయంతో జరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. బాధితురాలి యుక్తవయస్సు, స్వచ్ఛంద వివాహం, మార్పిడికి సంబంధించి నేరస్థుల నుండి ఎటువంటి క్లిష్టమైన పరీక్ష లేకుండానే మోసపూరిత సాక్ష్యాలను అంగీకరించడం ద్వారా న్యాయ వ్యవస్థ ఈ నేరాలను ఎనేబుల్ చేస్తుందని కూడా ఈ నివేదికలు సూచిస్తున్నాయి.

Ukraine Crisis: యుద్ధం తీవ్రతరం.. అపార్ట్‌మెంట్‌పై రష్యా దాడిలో 40 మంది మృతి

మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా బాధితులందరికీ న్యాయం, చట్టం ప్రకారం సమాన రక్షణ కల్పించడం అత్యవసరమని నిపుణులు చెప్పారు. బలవంతపు మతమార్పిడులు, బలవంతంగా బాల్య వివాహాలు, కిడ్నాప్, అక్రమ రవాణాను నిషేధించే చట్టాన్ని పాకిస్తాన్ అధికారులు తప్పనిసరిగా ఆమోదించి, అమలు చేయాలని.. బానిసత్వం, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి.. మహిళలు, పిల్లల హక్కులను సమర్థించేందుకు వారి అంతర్జాతీయ మానవ హక్కుల కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని వారు సూచించారు.