NTV Telugu Site icon

Hunger Crisis : ప్రతేడాది 80కోట్లమందికి సరిపోయే ఆహారం వృధా

New Project (82)

New Project (82)

Hunger Crisis : ఒకవైపు ప్రపంచంలో ఆకలి, పేదరికం స్థాయి పెరుగుతోంది. మరోవైపు రోజులో ఎంత ఆహారం వృథా అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని నిరంతరం వృధా చేయడంపై ఒక నివేదికను తీసుకొచ్చింది. ఇది ఒక వైపు 80 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉండవలసి వస్తుంది. మరోవైపు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని పేర్కొంది.

Read Also:Allu Arjun : తన విగ్రహంతో అల్లు అర్జున్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బుధవారం ఐక్యరాజ్య సమితి ఆహార వ్యర్థాల సూచిక నివేదికను విడుదల చేసింది. దీనిలో ప్రపంచంలోని 800 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో ఉన్న సమయంలో గృహాలు, రెస్టారెంట్లు ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఆహారాన్ని పడేస్తున్నట్లు చెప్పింది. ఈ నివేదిక ప్రకారం 2022లో ఒక బిలియన్ టన్నులకు పైగా ఆహారం వృధాగా పడేశారట. నిరంతర ఆహారాన్ని వృధా చేయడం ప్రపంచ విషాదమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని వృధా చేయడం వల్ల మిలియన్ల మంది ప్రజలు ఈ రోజు ఆకలితో ఉండవలసి వస్తుంది. ఈ రకమైన వ్యర్థాలు పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను UN సహకారంతో WRAP (వరల్డ్‌వైడ్ రెస్పాన్సిబుల్ అక్రెడిటెడ్ ప్రొడక్షన్) అనే సంస్థ రూపొందించింది. ప్రపంచంలో 800 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారని, ప్రతిరోజూ వృధా అవుతున్న ఆహారంతో మీరు వారికి ఒక రోజు ఆహారం పెట్టవచ్చని ఆయన అన్నారు.

Read Also:Anurag Thakur: ఈడీ, సీబీఐతో మా పార్టీకి సంబంధం లేదు..

ఆహారం పడేస్తున్నది ఎక్కువ ఎవరంటే ?
2022లో రెస్టారెంట్లు, క్యాంటీన్‌లు, హోటళ్లు 28 శాతం ఆహారం వృధా కావడానికి కారణమయ్యాయి. అయితే ఆహార వ్యర్థాలకు గృహాలు అతిపెద్ద సహకారిగా ఉన్నాయి. 60 శాతం అంటే దాదాపు 631 మిలియన్ టన్నులు. ప్రజలు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇది ఎక్కువగా జరిగిందని స్వానెల్ చెప్పారు. ఆహార వ్యర్థాలు ప్రపంచ వ్యవసాయంలో దాదాపు 30 శాతానికి సమానమని నివేదిక చెబుతోంది. ఆహారాన్ని వృధా చేయడంలో దాని ఎక్స్ పైయిరీ డేట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని స్వానెల్ చెప్పారు.