Viral Wedding: నిజంగా కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే చాలా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వాటిని మించింది.. ఓ 72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువుతో వివాహం చేసుకున్నాడు.. పోయే కాలంలో పెళ్లేంది సామి అని అనేటోళ్లు కొందరు అయితే.. ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదు.. మనసుతోనే సంబంధం అని చెప్పే వాళ్లు మరి కొందరు. ఇంతకీ వీళ్ల కథ ఎక్కడ మొదలైంది.. వారికి భారత దేశంతో ఉన్న సంబంధం ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: CAG Report: 10 ఏళ్లలో భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే..?
నాలుగేళ్లుగా కలిసి జీవిస్తూ.. భారత్‌లో పెళ్లి చేసుకున్నారు.
ఉక్రెయిన్‌కు చెందిన స్టానిస్టేవ్(72) అనే వ్యక్తి అన్హెలీనా(27) అనే యువతితో నాలుగేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఈక్రమంలో వాళ్లు పెళ్లి అనే బంధంతో ఒక్కటి అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు భారతీయ సంస్కృతిపై ఉన్న అభిమానంతో పాటు హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని అభిప్రాయానికి వచ్చి.. వాళ్ల వివాహానికి భారత్‌ను ఎంచుకున్నారు. వాళ్లకు సాయం చేయడానికి దేశంలో పెళ్లిళ్లు నిర్వహించే ఓ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థకు సంబంధించిన వాళ్లు భారతీయ సంప్రదాయంలో జరిగే పెళ్లి గురించి కొన్ని వీడియోలు ఆ జంటకు పంపించారు. వీటితోపాటు వాళ్లు వివాహ వేడుకకు అనువైన మూడు ప్రాంతాలను వారికి సూచించారు. వీడియోలు చూసిన ఆ జంట వాళ్ల పెళ్లికి జోథ్‌పూర్ కరెస్ట్ ప్లేస్‌గా ఎంచుకుంది.
ముందు ఢిల్లీకి… ఆ తర్వాత జోథ్‌పూర్‌కు
ఈ జంట ముందు ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి వచ్చి.. తర్వాత వారి బంధుమిత్రులతో కలిసి జోథ్‌పూర్‌లో పెళ్లి జరిగే స్థలానికి చేరుకున్నారు. 72 ఏళ్ల వరుడు, 27 ఏళ్ల వధువు సంప్రదాయ దుస్తులు ధరించి పూజా క్రతువులో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య ఏడడుగులతో వాళ్లు వివాహబంధంలోకి అడుగు పెట్టారని ఈ వివాహాన్ని జరిపించిన సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఈ జంట ఎక్కడో పుట్టి భారతీయ సాంప్రదాయాలపై మక్కువతో ఇండియా వచ్చి మరి పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. కొందరేమో పెళ్లి, ప్రేమకు వయస్సుతో సంబంధం లేదంటూ పోస్ట్‌లు పెడుతుంటే.. మరికొందరు పోయే కాలంలో పెళ్లి ఎందుకు సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
READ ALSO: Godhra Violence: పోలీస్ స్టేషన్‌పై ముస్లిం గుంపు దాడి.. గోద్రాలో టెన్షన్ టెన్షన్