Ukraine map change: వాషింగ్టన్‌లో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అలాగే ఏడుగురు యూరోపియన్ నాయకుల మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియవచ్చనే ఆశను కలిగించింది. ఈ సమావేశంతో యుద్ధం ముగిసిపోతుందని అనిపిస్తున్నా, దాని కోసం ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ సమయంలో పుతిన్ దళాలు స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ ప్రాంతాలను శాంతి చర్చలలో భాగంగా రష్యాకు అప్పగించాలనే వాదనతో ఉక్రెయిన్ మ్యాప్ మారబోతుందనే అనుమానాన్ని కలిగిస్తుంది.
READ MORE: Karnataka: 13 ఏళ్ల బాలుడిపై 48 ఏళ్ల టీచర్ లైంగిక దాడి.. పోక్సో చట్టంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉక్రెయిన్‌లోని ఐదవ వంతు భూభాగం ఉంది. ఇటీవల అలాస్కాలో ట్రంప్- పుతిన్ మధ్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో యుద్ధాన్ని ముగించడానికి రష్యా ఆక్రమిత ఉత్తర ఉక్రెయిన్‌లోని చిన్న భాగాలను మాత్రమే వదులుకుంటుందని మాస్కో స్పష్టం చేసినట్లు సమాచారం. దానికి బదులుగా ఉక్రెయిన్ తూర్పున ఉన్న లుహాన్క్, డొనెట్స్ ప్రావిన్సులలోని పెద్ద భాగాలను వదులుకోవలసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
యుఎస్ థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం.. రష్యా సుమీ, ఖార్కివ్ ప్రాంతాలలోని మొత్తం 440 చదరపు కిలోమీటర్లు కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్ డాన్‌బాస్లోని దాదాపు 6,600 చదరపు కిలోమీటర్లను నియంత్రిస్తుంది. ఇందులో డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం రష్యా రెండు ప్రాంతాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. మాస్కో 2014 యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను ఆక్రమించింది. ఈ భూభాగంపై రష్యా సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం.
రష్యా ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 114,500 చదరపు కిలోమీటర్లు (44,600 చదరపు మైళ్ళు), అంటే సుమారుగా 19% భూభాగాన్ని నియంత్రిస్తుంది. వీటిలో క్రిమియా, అలాగే ఉక్రెయిన్ దేశంలోని తూర్పు, ఆగ్నేయంలోని పలు పెద్ద ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఉక్రెయిన్ ఏ రష్యన్ భూభాగాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకోలేదు. ఉక్రెయిన్‌లో పాక్షికంగా ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలైన లుహాన్స్, డొనెట్స్, జపోరిజ్జియా, ఖెర్సన్లను స్వాధీనం చేసుకోవడం పుతిన్ యుద్ధం లక్ష్యంగా కనిపిస్తుంది. రష్యా తమ భూమిని ఆక్రమించడాన్ని ఎప్పటికీ గుర్తించబోమని ఉక్రెయిన్ పదే పదే ప్రకటనలు జారీ చేసినా, ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి.
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో దాదాపుగా 46,570 చదరపు కిలోమీటర్లు అంటే మొత్తం డాన్‌బాస్ భూభాగంలో 88% రష్యా నియంత్రణలో ఉంది. ఇందులో దాదాపు 76% లుహాన్క్, డోనెట్స్ ప్రాంతాలు ఉన్నాయి. సుమారుగా 6,600 చదరపు కిలోమీటర్ల డాన్‌బాస్ ఇప్పటికీ ఉక్రెయిన్ నియంత్రణలో ఉంది. ప్రస్తుతం రష్యన్ దళాలు పోక్రోమ్స్, చార్సివ్ యార్ వంటి కీలకమైన డొనెట్స్ పట్టణాల వైపు ముందుకు సాగుతున్నాయి. డాన్‌బాస్‌లోని కొంత భాగం 2014లో ఉక్రేనియన్ ప్రభుత్వ నియంత్రణ నుంచి విడిపోయిన డొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలలోని రష్యన్ మద్దతు గల వేర్పాటువాదుల నియంత్రణలో ఉంది. వేర్పాటువాద నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు.
READ MORE: wife kills husband: భర్త హత్యకు గూగుల్‌ను ప్లాన్ అడిగింది..