Site icon NTV Telugu

Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు..

Ukraine Drone Attack

Ukraine Drone Attack

Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్‌ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ప్రాంతీయ అధికారులు తెలిపారు. దాడి సమయంలో రష్యా వైమానిక రక్షణ విభాగం 164 ఉక్రేనియన్ డ్రోన్‌లను గాల్లోనే ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

READ ALSO: Womens World Cup 2025 Final: చరిత్ర సృష్టించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు రెడీ.. మ్యాచ్ కు అడ్డంకిగా మారిన వరణుడు..!

దాడిపై స్పందించిన రష్యా అధికారులు..
“టుయాప్సేలో జరిగిన UAV (మానవరహిత వైమానిక వాహనం) దాడికి ప్రతిస్పందిస్తున్నట్లు క్రాస్నోడర్ పరిపాలన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపింది. సైనిక లాజిస్టిక్స్‌కు అంతరాయం కలిగించడానికి ఉక్రెయిన్ ఈ దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవని, ఏ పోర్టు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని చెప్పారు. క్రాస్నోడార్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ నివేదికల ప్రకారం.. డ్రోన్ శిథిలాలు పడిపోవడం వల్ల ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు, మంటలు చెలరేగాయి. ఈ ఓడరేవులో టుయాప్సే ఆయిల్ టెర్మినల్, రోస్నెఫ్ట్ నియంత్రణలో ఉన్న టుయాప్సే ఆయిల్ రిఫైనరీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఉక్రేనియన్ డ్రోన్లు రెండు ప్రదేశాలను చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఏ ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని ఈ నివేదికలు పేర్కొన్నాయి.

రష్యన్ విద్యుత్ గ్రిడ్‌పై దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ – రష్యన్ శుద్ధి కర్మాగారాలు, డిపోలు, పైప్‌లైన్‌లపై దాడులను ముమ్మరం చేసింది. ఇంధన సరఫరాలపై ఒత్తిడి తీసుకురావడం, సైనిక లాజిస్టిక్స్‌కు అంతరాయం కలిగించడం, రష్యా యుద్ధకాల వ్యయాన్ని పెంచడం ఈ దాడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. టుయాప్సే వెలుపల ఉన్న సోస్నోవి గ్రామంలో డ్రోన్ శిథిలాల వల్ల ఒక అపార్ట్‌మెంట్ భవనం దెబ్బతిన్నట్లు క్రాస్నోడర్ పరిపాలన నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.

READ ALSO: Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?

Exit mobile version