NTV Telugu Site icon

Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. 3 విమానాశ్రయాలు మూసివేత

Masco

Masco

రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్‌ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సరిహద్దులో పోరాటం చేయగా.. క్రమంగా మాస్కోకు చేరుకుంది. ఈ దాడుల్లో డ్రోన్లు అతిపెద్ద ఆయుధంగా మారాయి.

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు

రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. ప్రారంభంలో రష్యా యుద్ధంలో పెద్ద ఎత్తున విజయం సాధించింది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఉక్రెయిన్ యుద్ధ దిశను మార్చే పనిలో పడింది. ఇప్పుడు రష్యా నగరాలను ఉక్రెయిన్ డ్రోన్లతో టార్గెట్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా మాస్కో నగరాన్ని టార్గెట్ చేస్తున్నారు. క్రిమియాలో 42 డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ఇటీవలే చెప్పడంతో దీనిని అంచనా వేయవచ్చు.

Gruhalakshmi Kasturi: అక్కా అంటూనే నన్ను అసభ్యంగా టచ్ చేశాడు.. దుల్కర్ కూడా అలానే

ఈ సంవత్సరం ఆరంభంలో ఉక్రెయిన్.. రష్యా లోపలికి వెళ్లి యుద్ధం చేస్తామని తెలిపింది. రష్యా అంతర్భాగంలోని సైనిక స్థావరాలపై దాడి తామే జరిపినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అంతేకాకుండా.. రష్యా సైనిక ఆస్తులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్లను పొందుతుండగా.. వాటి ద్వారా రష్యాపై దాడులు చేస్తున్నారు.