NTV Telugu Site icon

Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి

Russia Ukraine

Russia Ukraine

Russia-Ukraine War: న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా దళాలు ఉన్న మకివ్కా నగరంలోని ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ క్షిపణిని ప్రయోగించింది. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియ‌దు. కానీ ర‌ష్యాన్ అధికారులు ఆ దాడిని ద్రువీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

డొనెట్స్క్ 2014 నుంచి రష్యన్-మద్దతు గల వేర్పాటువాదుల ఆధీనంలో ఉంది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్టోబర్‌లో మాస్కోను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో ఇది ఒకటి. న్యూ ఇయ‌ర్ అర్థరాత్రి మ‌కీవ్‌కా న‌గ‌రంపై దాడి జ‌రిన‌ట్లు ర‌ష్యా అధికారి డానిల్ బెజ‌నోవ్ తెలిపారు. గ‌త ఏడాది ఫిబ్రవ‌రిలో యుద్ధం మొద‌లైన నాటి నుంచి డోన‌స్కీ ప్రాంతంలో ఉన్న ర‌ష్యా ద‌ళాల్ని ఉక్రెయిన్ టార్గెట్ చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న న‌గ‌రాల‌పై దాడులు కొన‌సాగిస్తోంది. గ‌తేడాది ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది సాధార‌ణ పౌరులు మ‌ర‌ణించిన‌ట్లు ర‌ష్యా అధికారులు చెబుతున్నారు.