Site icon NTV Telugu

Rishi Sunak: ‘చేయాల్సింది చాలా ఉంది’.. వాతావరణ శిఖరాగ్ర ఒప్పందంపై రిషి సునాక్‌

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak: ఈజిప్టులో జరిగిన కాప్‌-27 వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆదివారం స్వాగతించారు. అయితే “చేయాల్సింది చాలా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. “కాప్‌-27లో సాధించిన పురోగతిని నేను స్వాగతిస్తున్నాను, కానీ ఆత్మసంతృప్తి కోసం సమయం ఉండదు. మరిన్ని చేయాలి” అని నాయకుడు ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భూ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల మేర తగ్గించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని అన్నారు.

Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి

బలహీన దేశాలకు సహాయం చేయడానికి “లాస్‌ అండ్ డేమేజ్‌” పేరిట నిధిని రూపొందించడానికి యూఎన్ వాతావరణ సదస్సు అంగీకరించింది. ఈ నిధిని ఏర్పాటు చేయాలని కాప్‌-27 సదస్సులో అంగీకారం కుదరగా.. దీనిని బ్రిటన్‌ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని సునాక్‌ అన్నారు. కానీ పారిశ్రామిక పూర్వ స్థాయిల నుంచి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే ఆకాంక్ష లక్ష్యాన్ని సజీవంగా ఉంచడానికి ఉద్గారాలను మరింత తగ్గించడంలో ఇది విఫలమైంది. కర్బన ఉద్గారాలు పలు దేశాల్లో పెరిగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈజిప్ట్‌లోని రెడ్‌ సీ రిసార్ట్‌లో దేశీయ కట్టుబాట్లను అణిచివేయడంపై సునాక్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తొలుత సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించిన సునాక్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సదస్సుకు హాజరయ్యారు.
.

 

Exit mobile version