Site icon NTV Telugu

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట్లో దీపావళి వేడుకలు..

Rishi Sunak

Rishi Sunak

భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా సునాక్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని రంగు రంగుల దీపాలతో రెడీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్(ఎక్స్‌)లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా
రిషి సునాక్‌ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వెల్లడించారు.

Read Also: Telangana Assembly Election: ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్.. ఒక్క ట్రిప్‌కు 2 నుంచి 5 లక్షలా..

ఇక, భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ దీపావళి వేడులక కార్యక్రమంలో పలువురు ఇండో అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ తదితరులతో కమలా హ్యారిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య పోరును గురించి ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సహాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

Exit mobile version