Bob Blackman: పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావాలి.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ఎంపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bob Blackman: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే కావడం విషాదకరం. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”ను బ్లాక్‌మన్ కొనియాడారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి అనంతరం, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఈ ఉగ్ర స్థావరాలను తొలగించేందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వీడియోను సోషల్ మీడియా వేదికగా ‘X’లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Read Also: Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
మే 7న భారత్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని ‘ఆపరేషన్ సిందూర్’గా భారత ప్రభుత్వం పిలిచింది. దీని ప్రతిగా పాకిస్తాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ద్వారా ప్రతిదాడి జరిగింది. అయితే, భారత సైన్యం ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అనంతరం భారత వైమానిక దళాలు పాకిస్తాన్ ప్రధాన నగరాలైన లాహోర్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో ఉన్న మిలటరీ ఇన్స్టాలేషన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేశాయి.
Following the horrific terror attack in Pahalgam, India launched Operation Sindoor: precision air-strikes on 9 terrorist bases.
As peace talks continue, I asked what steps the Foreign Secretary is taking to ensure the terrorist bases are removed from Pakistan-occupied Kashmir? pic.twitter.com/qvtnwe5g03
— Bob Blackman (@BobBlackman) May 14, 2025
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!