Site icon NTV Telugu

Bob Blackman: పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావాలి.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ఎంపీ..!

Bob Blackman

Bob Blackman

Bob Blackman: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే కావడం విషాదకరం. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”ను బ్లాక్‌మన్ కొనియాడారు.

Read Also: Kohli-Rohit: కోహ్లీ-రోహిత్ ముందే వీడ్కోలు పలికారా?.. 50 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్ ఆడిన ప్లేయర్స్ వీరే!

ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి అనంతరం, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఈ ఉగ్ర స్థావరాలను తొలగించేందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వీడియోను సోషల్ మీడియా వేదికగా ‘X’లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read Also: Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..

మే 7న భారత్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని ‘ఆపరేషన్ సిందూర్’గా భారత ప్రభుత్వం పిలిచింది. దీని ప్రతిగా పాకిస్తాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ద్వారా ప్రతిదాడి జరిగింది. అయితే, భారత సైన్యం ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అనంతరం భారత వైమానిక దళాలు పాకిస్తాన్ ప్రధాన నగరాలైన లాహోర్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో ఉన్న మిలటరీ ఇన్‌స్టాలేషన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేశాయి.

Exit mobile version