Aadhaar: మీ పిల్లల ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా?.. UIDAI కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్!
- UIDAI కీలక నిర్ణయం
- ఇకపై స్కూల్లోనే అప్ డేషన్
- 45-60 రోజుల్లో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్‌కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి. చేసుకోకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఆధార్ అప్ డేట్ ను సులభతరం చేయడానికి యుఐడిఎఐ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కింద బాల్ ఆధార్‌ను అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉండదు. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది.
Also Read:Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
పిటిఐ నివేదిక ప్రకారం.. యుఐడిఎఐ త్వరలో పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని కింద, ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతారు. ఇక్కడి నుండి వాటిని ఒక పాఠశాల నుంచి మరొక స్థానిక పాఠశాలకు పంపుతారు. ఈ పని దశలవారీగా పూర్తవుతుందని ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఆధార్ అథారిటీ పాఠశాలల ద్వారా ఆధార్ కార్డులను అప్ డేట్ చేసే చర్యలను ప్రారంభించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేష్ కుమార్ ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలను ప్రారంభించే ప్రాజెక్ట్‌పై పని జరుగుతోంది. సాంకేతికతను పరీక్షిస్తున్నామని.. 45-60 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Also Read:Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
ఆధార్ కార్డులను బయోమెట్రిక్స్‌తో అప్‌డేట్ చేయని పిల్లల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇప్పుడు అది 7 కోట్లు దాటిందని భువనేష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి అని, ఈ సంఖ్య పెరుగుతున్నందున, పాఠశాలల ద్వారా ఈ పనిని ఆలస్యం చేయకుండా చేయడానికి UIDAI ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!