Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ugandan Villager Has 12 Wives 102 Children 578 Grandchildren

A man With 12 Wives: పుట్ల కొద్దీ పిల్లల్ని కన్నడు.. ఇప్పుడు ప్లానింగ్ అంటున్నడు..

Published Date :February 4, 2023 , 11:37 am
By Mahesh Jakki
A man With 12 Wives: పుట్ల కొద్దీ పిల్లల్ని కన్నడు.. ఇప్పుడు ప్లానింగ్ అంటున్నడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

A man With 12 Wives: ఓ వ్యక్తి ఒకట్రెండు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్‌ టీం కంటే ఓ ఎక్స్‌ట్రా ప్రేయర్ అదనంగా ఉన్నట్లు 12 మందిని మనువాడాడు. పిల్లలను కూడా పదుల సంఖ్యలో కాదు.. సెంచరీని దాటి దూసుకుపోతున్న పిల్లల సంఖ్యతో అతని గురించి తెలుసుకున్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 578 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లకు తాత అయ్యాడు. ఈ 12 మంది భార్యలతో అతనికి 102 మంది పిల్లలు ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడిక వారిని పోషించలేకపోతున్నానని.. పిల్లలు వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నాడు. ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన ఆ పెద్దమనిషి పేరు మూసా హసస్య. మ‌రి ఆ ఘ‌నుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్లక త‌ప్పదండోయ్.

తూర్పు ఉగాండాకు చెందిన ముసా హ‌స‌స్య క‌సేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు. 17 ఏళ్ల వ‌య‌సులో 1972లో తొలి వివాహం చేసుకున్నాడు. వివాహం జ‌రిగిన ఏడాదికి తొలికాన్పులో సాండ్రా నాబ్వైర్ జ‌న్మించింది. అయితే ఒక భార్యతో సుఖంగా ఉన్న అత‌నికి.. వంశాభివృద్ధి కోసం మ‌రిన్ని వివాహాలు చేసుకోవాల‌ని సోద‌రుడు, బంధువులు సూచించారు. వారి మాట న‌మ్మిన హ‌సస్య.. ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. 102 మంది పిల్లల‌ను క‌న్నాడు. ఈ పిల్లల‌కు కూడా వివాహాలు అయ్యాయి. 578 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లకు హస‌స్య తాత అయ్యాడు. వారి కుటుంబమే ఓ గ్రామమంతా అయ్యింది.

New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం

ఇంతమంది పిల్లలు ఉన్నారని అతను ధనవంతుడు అనుకుంటే పొరపాటే. ఇంతకీ అతనికి ఉన్న ఆస్తిపాస్తులు ఎంత అంటే.. కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే. ఈ 102 మంది పిల్లలు, 12 మంది భార్యలు, అతనికి.. మొత్తం ఆ రెండు ఎకరాల భూమి ఆధారం. ఈ చిన్న ఆస్తితో అతను ఇంతమందికి దుస్తులు, సరిపోయేంత ఆహారం సంపాదించలేకపోతున్నాడు. తిండి పట్టా సరిగా లేకపోవడంతో ఇద్దరు భార్యలు ఇటీవలే విసుగు చెంది ముసాను విడిచిపెట్టి వెళ్లిపోయారు. హ‌స‌స్య చిన్న భార్య వ‌య‌సు 35 ఏళ్లు కాగా, అత‌నికి క‌లిగిన సంతానంలో 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌సున్న వారు ఉన్నారు. వంద‌లాది పిల్లల్లో చాలా మంది పిల్లల పేర్లు కూడా హ‌స‌స్యకు తెలియ‌దు. పిల్లల‌ను గుర్తించ‌డంతో భార్యల స‌హాయం తీసుకుంటున్నాడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటేనే ఇళ్లు సందడిగా ఉంటుంది. అలాంటిది 102 మంది పిల్లలు.. అది రకరాకాల వయసు వారు ఉంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12 wives
  • A man With 12 Wives
  • children
  • Musa Hasahya Kasera
  • uganda

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions