Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Uganda Army Chief Demands 1 Billion Turkey Controversy

Uganda: ” మీ దేశంలో అందమైన మహిళను నాకు ఇవ్వండి”.. ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్..

Published Date :April 12, 2026 , 5:13 pm
By Venu Goapl Reddy
  • మాకు 1 బిలియన్ డాలర్లు చెల్లించాాలి..
  • పెళ్లి చేసుకోవడానికి మీ దేశంలో అందమైన మహిళను ఇవ్వాలి..
  • టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్లు..
Uganda: ” మీ దేశంలో అందమైన మహిళను నాకు ఇవ్వండి”.. ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uganda: ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ఆర్మీ చీఫ్ అయిన ముహుజీ కైనెరుగాబా చేసిన డిమాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమకు 1 బిలియన్ డాలర్లు, మీ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని టర్కీని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భద్రతా ప్రయత్నాలకు ఉగాండా చేసిన కృషిని గుర్తించలేదని, దానికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉంతటుందని కైనెరుగాబా అన్నారు.

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, 30 రోజుల్లోగా టర్కీతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని, రాజధాని కంపాలోని వారి కార్యాలయాన్ని మూసేస్తామని ఆయన హెచ్చరించారు. టర్కీలోని అత్యంత అందమైన మహిళను తనకు అప్పగించాలని, ఆమెను పెళ్లి చేసుకుంటాన్ని చెబుతూ ఆ దేశాన్ని కోరడం వివాదాస్పదంగా మారింది. సోమాలియా రాజధాని మొగాదిషు లోని ఓడరేవులు, విమానాశ్రయాలు, అనేక ప్రాజెక్టుల నుంచి టర్కీ లబ్ధి పొందుతోందని కైనెరుగాబా ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల నుండి టర్కీ లాభాలు ఆర్జిస్తుండగా, ఉగాండా చాలా సంవత్సరాలుగా భారీ భద్రతా బాధ్యతను మోస్తోందని ఆయన పేర్కొన్నారు.

Read Also: Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!

ఉగాండా గత రెండు దశాబ్ధాలుగా ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియలో సైనిక దళాలను మోహరించి, ప్రధానంగా అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థతో పోరాడటానికి ఈ దళాలను పంపింది. టర్కీ నుంచి ఉగాండాకు భద్రతా డివిడెంట్‌గా 1 బిలియన్ డాలర్లు అందాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో కైనెరుగాబా ఇజ్రాయిల్‌కు మద్దతు తెలిపారు. పవిత్ర భూమిని, మన దేవుడైన యేసు క్రీస్తు భూమిని రక్షించడానికి నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయిల్‌కు పంపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కైనెరుగాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురించి మాట్లాడుతూ.. ఇటలీ ప్రధానిని వివాహం చేసుకోవడానికి, బదులుగా తనకు భూమిపై అత్యంత అందమైన ఆవులుగా అభివర్ణించిన 100 అంకోలే ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన బహిరంగంగా ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • international politics controversy
  • Muhoozi Kainerugaba
  • Somalia security forces
  • Turkey
  • Uganda army chief controversy

తాజావార్తలు

  • Uganda: ” మీ దేశంలో అందమైన మహిళను నాకు ఇవ్వండి”.. ఉగాండా ఆర్మీ చీఫ్ షాకింగ్ డిమాండ్..

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • Wife Kills Husband: ఇలా తయారయ్యారేంటే.. ప్రియుడితో కలిసి భర్త హత్య..

  • Shivraj Singh Chouhan: బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ సీఎం ఎవరో తేల్చేయనున్నది ఈయనే!

  • Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్.. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు..

ట్రెండింగ్‌

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions