NTV Telugu Site icon

Ugadi Special : దేవుని కడపలో ఉగాది వేడుకలు.. పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు

Devuni Kadapa

Devuni Kadapa

తెలుగు వారి తొలి పండుగ ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఇక్క‌డ హిందువులే కాదు.. ముస్లీంలు కూడా అత్యంత భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకుంటారు. శ్రీ‌నివాసునికి కాయ క‌ర్పూరం స‌మ‌ర్పించి, ఇక్క‌డి పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇందుకోసం ముస్లింలు క‌లియుగ‌ ద‌ర్శించుకోవ‌డం దేవుని క‌డ‌పలో ఉగాది పండుగ ప్రత్యేక‌త‌. క‌డ‌ప‌లో అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ప్ర‌తి ఉగాది రోజున తిరుమ‌ల తొలి గ‌డ‌ప దేవుని క‌డ‌ప‌లో శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తితో పూజించి, కానుక‌లు స‌మ‌ర్పించ‌డం ఇక్క‌డి ముస్లీంల‌కు త‌ర‌తరాలుగా వ‌స్తున్న‌ఆన‌వాయితీ. ఉద‌యాన్నే దేవుని క‌డ‌ప ఆల‌యానికి చేరుకుని, కాయ‌క‌ర్పూరం స‌మ‌ర్పించి, ముడుపులు స‌మ‌ర్పించారు ముస్లిం భ‌క్తులు.

Also Read : TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఆపేపర్‌ రాసేందుకు కేవలం 15 నిమిషాలే..

ఉగాది రోజున వేంక‌టేశ్వ‌రున్ని ద‌ర్శించి, ఆల‌య పూజారికి బియ్యం బేడ‌లు స‌మ‌ర్పించి, ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని ఇక్క‌డి ముస్లింల విశ్వాసం. అందుకే క్ర‌మం త‌ప్ప‌కుండా దేవుని క‌డ‌ప‌ను ముస్లింలు ఉగాది రోజున సంద‌ర్శించి మ‌త సామ‌ర‌స్యాన్ని చాటుతున్నారు. చూసేవారికి కొత్త‌గా అనిపించినా, త‌మ‌ బీబీ నాంచార‌మ్మ‌ను శ్రీ‌నివాసుడు ప‌రిణ‌యం చేసుకున్నాడ‌ర‌న్న కార‌ణంతో క‌డ‌ప ముస్లింలు మాత్రం అత్యంత భ‌క్తితో, ప్రీతి పాత్రంగా ఉగాదిని జ‌రుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జ‌రుపుకోవ‌డం సాధ్యం కాక‌పోతే ఇబ్బందులు ప‌డ్డామ‌ని, కొంద‌రు ముస్లింలు చెబుతున్నారు.త‌మ పూర్వీకుల నుంచి ఈ సాంప్ర‌దాయం వ‌స్తోంది. పెద్ద‌లు చేసిన‌ట్లే తాము ఇప్పుడు గుడికి వ‌చ్చి ఉగాదిని జ‌రుపుకుంటామ‌ని చెబుతున్నారు.

Also Read : KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ

Show comments