NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram: ఉగాది వేళ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్!

Saripodhaa Sanivaaram Poster

Saripodhaa Sanivaaram Poster

Nani’s Saripodhaa Sanivaaram Movie Poster: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే ఫ‌స్ట్ లుక్, పోస్టర్, స్పెషల్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల కాగా.. అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేడు (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. సాయి కుమార్, నాని ఉన్న ఫోటోను పంచుకుంది. సూర్యగా నాని మరియు శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్‌లో చిరునవ్వుతో కనిపిస్తారు. పోస్టర్‌లో మనం ఒక వేడుక వాతావరణాన్ని చూడవచ్చు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!

సరిపోదా శనివారం భిన్నమైన కథాంశంతో రూపొందనున్న చిత్రం. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే కోపంగా కనిపించే హీరో కథగా ఉంటుంది. యాక్షన్‌, వినోదానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ డైరెక్టర్ ఎస్‌జె సూర్య ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. దసరా, హాయ్ నాని వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నాని.. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.