Saripodhaa Sanivaaram: ఉగాది వేళ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani’s Saripodhaa Sanivaaram Movie Poster: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, పోస్టర్, స్పెషల్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల కాగా.. అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేడు (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. సాయి కుమార్, నాని ఉన్న ఫోటోను పంచుకుంది. సూర్యగా నాని మరియు శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్‌లో చిరునవ్వుతో కనిపిస్తారు. పోస్టర్‌లో మనం ఒక వేడుక వాతావరణాన్ని చూడవచ్చు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
Also Read: Bellamkonda Sreenivas: మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!
సరిపోదా శనివారం భిన్నమైన కథాంశంతో రూపొందనున్న చిత్రం. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే కోపంగా కనిపించే హీరో కథగా ఉంటుంది. యాక్షన్, వినోదానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమిళ డైరెక్టర్ ఎస్‌జె సూర్య ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. దసరా, హాయ్ నాని వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన నాని.. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?