Udhampur Leopard: నాలుగేళ్ల పాపను ఇంటినుంచి ఎత్తుకెళ్లిన చిరుత.. రెండు కిలో మీటర్ల దూరంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhampur Leopard: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నాలుగేళ్ల పాపను చిరుతపులి ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత తన ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది. ఘటనపై ఉదంపూర్ కంట్రోల్ రూంకు సమాచారం అందిన వెంటనే ఒక బృందాన్ని సిద్ధం చేసి సంఘటనా స్థలానికి పంపించారు. దీని తర్వాత బృందం పాప కోసం వెతకడం ప్రారంభించింది. ఉధంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ ఆఫీసర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ‘రాత్రి 7-8 గంటల సమయంలో చిరుతపులి ఒక బాలికను తీసుకెళ్లింది. మాకు సమాచారం అందిన వెంటనే ఉదంపూర్ కంట్రోల్ రూం నుంచి బృందాన్ని పంపించాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఇక్కడికి వచ్చామన్నారు.
ఇది చాలా దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అవగాహన ప్రచారంలో భాగంగా, పిల్లలు, మహిళలు, వృద్ధులను తెల్లవారుజామున, సాయంత్రం ఒంటరిగా వెళ్లనివ్వవద్దని ప్రజలను కోరారు. అనంతరం స్థానికులు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. దూరంగా చిధ్రమైన స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. ఉదంపూర్‌లోని పంచ్రీ తహసీల్ ఎగువ గ్రామం బంజ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Read Also:Andrapradesh: భయపెడుతున్న చిరుతలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచారం
Udhampur, J&K | Between 7-8pm, a 4-year-old girl was taken away by a leopard. As we got the information, we dispatched teams from Udhampur control room. We’re here to ensure that such incidents don’t occur in the future. This is a very unfortunate incident, and we will do all the… pic.twitter.com/gabR7L4Tcs
— ANI (@ANI) September 3, 2023
చిరుతపులిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. త్వరలోనే ఎలాగైనా చిరుత పులిని పట్టుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూస్తామన్నారు. వారికి వీలైనంత త్వరగా పరిహారం అందజేస్తామన్నారు. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తెల్లవారుజామున, చీకటి పడిన తర్వాత వన్యప్రాణులు ఈ సమయంలో చాలా చురుగ్గా ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు.
Read Also:Vijay Deverakonda: సంధ్య థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రెడీగా ఉండండి రౌడీ వస్తున్నాడు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!