తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు. టీజీబీసీఎల్ నుంచి రావల్సిన బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని యూబీఎల్ తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు, తక్కువ ధరతో బీర్ల సరఫరాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. బీర్ల ధరలో సుమారు 70 శాతం ప్రభుత్వ పన్నులేనని యూబీఎల్ తెలిపింది. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను మరోసారి కోరుతున్నాం.. టీజీబీసీఎల్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు యూబీఎల్ వివరణ ఇచ్చింది.
Read Also: South Central Railway: విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు.. ఏపీఈఆర్సీకి సౌత్ సెంట్రల్ రైల్వే వినతి..
కాగా.. బుధవారం నుంచి రాష్ట్రంలో బీర్ల సరఫరా నిలిచిపోయింది. భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు బీర్ల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం వేసవి కాలంలో కింగ్ ఫిషర్ బీర్లు పెద్ద ఎత్తున సరఫరా కాకపోవడంతో మద్యం షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించిన విషయం తెలిసిందే. ఎక్కువగా యువకులు బీర్లను తాగుతారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌గా కింగ్ ఫిషరేకు మంచి పేరు వచ్చింది. అయితే.. పండగకు ముందు బీర్ల సరఫరా నిలిచిపోవడంపై యువతకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Read Also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ..