NTV Telugu Site icon

Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్‎లో ప్రయాణికుడు

Cab

Cab

Uber Cab:క్యాబ్ కంపెనీ ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ యువకుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇంత భారీ బిల్లు చూసి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న యువకుడి స్పృహ తప్పింది. వెంటనే కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. ఉబర్, ఓలా, ర్యాపిడో అంటూ క్యాబ్, బైక్ సర్వీసులు వచ్చాయి. వెంటనే ఎక్కిడికైనా వెళ్లాలంటే చాలు ఆన్ లైన్లో వాటిని బుక్ చేసుకుని ప్రయాణం చేస్తున్నం. మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత క్యాబ్ ల చార్జీలు పెంచేస్తూ వచ్చారు. ఇక డిమాండ్ ఎక్కువున్న సమయంలో సర్జ్ చార్జీల పేరుతో రెండు మూడింతలు ఎక్కువగా వసూలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది దూరానికే వందల్లో, వేలల్లో చార్జీలు పడుతున్న ఘటనలూ తెలుసు.

Read Also: Gujarat: గుజరాత్‎లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు

తాజా ఘటన బ్రిటన్‌కు చెందినది, ఇక్కడ 22 ఏళ్ల ఆలివర్ కల్పన్ తన ఆఫీసు నుంచి ఉబెర్ క్యాబ్‌ బుక్ చేశాడు. ఆఫీసుకు 6 కి.మీ దూరంలో ఉన్న పబ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ స్నేహితులతో కలిసి డ్రంక్ పార్టీకి వెళ్లాడు. అంతా బాగానే జరిగింది. ఆలివర్ క్యాబ్ ఎక్కి తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. అక్కడ పార్టీ చేసుకొని రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఆలివర్ కల్పన్ తన ఉబర్ ఖాతాను క్రెడిట్ కార్డుకు ముందే అనుసంధానం చేసి పెట్టుకోవడంతో బిల్లు ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. దానితో క్యాబ్ దిగి వెళ్లిపోయాడు. తాగిన కారణంగా, ఆలివర్ తన బిల్లును తనిఖీ చేయలేకపోయాడు. పొద్దున్నే లేచిన తర్వాత ఫోనులో క్రెడిట్ కార్డ్ బిల్లు చెక్ చేసుకున్నాడు. దీంతో రాత్రి చేసుకున్న పార్టీలో తాగినదంతా దిగింది మనోడికి. ఎందుకంటే అతడికి ఉబర్ ఏకంగా 39,317 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.32 లక్షలు) బిల్లు వచ్చింది.

Read Also: Book Fair in Hyderabad: బాక్స్‌ కొని అందులో ఎన్ని పడితే అన్ని తీసుకెళ్లండి. హైదరాబాద్‌లో బుక్‌ ఫెయిర్‌ రేపటి వరకే

బిల్లును చూసి కల్పన్ వెంటనే ఉబర్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. అంత బిల్లు వచ్చింది నిజమేనని.. అయితే క్రెడిట్ కార్డులు అంత బ్యాలెన్స్ లేనందువల్ల పేమెంట్ రిజెక్ట్ అయిందని కస్టమర్ కేర్ సిబ్బంది చెప్పారు. ఆ బిల్లు కట్టాలని కోరారు. అయితే తాను వెళ్లిన దూరానికి అంత బిల్లు ఎలా వచ్చిందంటూ కల్పన్ ఫిర్యాదు చేశాడు. కల్పన్ ఫిర్యాదుతో పరిశీలించిన ఉబర్ ఇంజనీర్లు.. తాను ప్రయాణించిన చోటు (డ్రాపింగ్) లొకేషన్ మారిపోయిందని గుర్తించారు. కల్పన్ క్యాబ్ డ్రాపింగ్ లొకేషన్ మాంచెస్టర్ లోని విచ్ వుడ్ ప్రాంతంకాగా.. ఉబర్ యాప్ లో లొకేషన్ ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో ఉన్న విచ్ వుడ్ పార్క్ గా చూపించింది. అంటే కల్పన్ క్యాబ్ లో ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ నుంచి ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు ప్రయాణించినట్టు చూపి.. రూ.32 లక్షలకుపైగా బిల్లు వేశారన్న మాట.‘‘ఇంకా నయం. నా కార్డులో అంత డబ్బు లేదు కాబట్టి బతికిపోయా. లేకుంటే వాళ్లు బిల్లు కట్ చేసుకుని ఉంటే.. రీఫండ్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది” అని ఓలివర్ కల్పన్ పేర్కొనడం గమనార్హం.

Show comments