Site icon NTV Telugu

Pro. Hara Gopal: హరగోపాల్ పై UAPA కేసు ఎత్తివేత.. ములుగు ఎస్పీ కీలక ప్రకటన

Hara Gopal

Hara Gopal

Pro. Hara Gopal: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసుకు సంబంధించి ములుగు ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తో పాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Read Also: S Jaishankar: ప్రధాని అమెరికా పర్యటనలో మరో ఘనత.. విన్‌స్టర్ చర్చిల్, నెల్సన్ మండేలా తర్వాత మోడీనే..

2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. వెంటనే ఆ కేసును ఆయనపై తొలగించాలని డిమాండ్ చేశారు.

Read Also: G-20 Countries: శ్రీ అన్న సాగు వినియోగాన్ని పెంచడానికి అంగీకరించిన జీ-20 దేశాలు

దీంతో.. హరగోపాల్‌ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్‌ ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలో కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే హరగోపాల్‌ తదితరులపై ఉపా కేసులు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు.

Exit mobile version