సంగారెడ్డి (మం) ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట అడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి. ఇద్దరిని పట్టుకుని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఆస్పత్రి ఎదుట హైడ్రామా నెలకొంది. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట కాలనీ వాసుల ఆందోళన చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనని విరమింపజేశారు.
READ MORE: CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్..
READ MORE: Delhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలికి అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ..