మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యాలు తీసుకుంటున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్, పోలీస్ డిపార్ట్ మెంట్ అవగాహన కల్పిస్తున్నప్పటికీ మాయమాటలకు మోసపోతున్నారు కొందరు యువతులు. తాజాగా బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినీ పై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Also Read:Tollywood: బిగ్ డైరెక్టర్స్ బిగ్గెస్ట్ ప్లాన్స్
బాధితురాలితో చనువుగా ఉన్న ఆసీస్ అనే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు తెలిపింది. ఏడాది నుంచి ఆసీస్ అగత్యం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసీస్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి తనపై మిస్ బిహేవ్ చేసినట్లు ఫిర్యాదుల పేర్కొన్నది బాధితురాలు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. బాధితురాలు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇరువురు యువకులు సహా-విద్యార్థులుగా సమాచారం.
