ఒక్కోసారి కథ కాదు టైటిల్ లోనే పవర్ కనిపిస్తుంది. ఆడియన్స్ ను ముందు థియేటర్ కి రప్పించేవి టైటిల్సే. అలాంటి ఓ మంచి టైటిలే జటాధర… ఒక పవిత్రమైన శబ్దం. శివుడి రూపం. శాంతంగా కనిపించినా శత్రువుల మీద శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాతో సుధీర్ బాబు మళ్లీ వచ్చాడు! మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అవుతుందని ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు, హిందీ రెండు భాషల్లో రానున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్. భాగీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఈసారి ఎపిక్ వార్ జటాధర తో ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి…
Also Read : Coolie : రజనీ-లోకేష్ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ ‘కూలీ’ కాదట
ఈసారి హిట్ కొడితే తెలుగులో ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింటే అవ్వాలని, ఫెయిల్యూర్స్ ని ఎరేజ్ చేసే ఎపిక్ వార్ జటాధర కావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక కార్తికేయ 2 వంటి భక్తి , మిస్టరీ, యాక్షన్ థ్రిల్లర్ తో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే షేడ్స్ తో “స్వయంభు” వస్తోంది. స్వయంభు లో మహాభారతం టచ్, హీరో లుక్‌లో వారియర్ వైబ్రేషన్, విజువల్స్‌లో ఓ ఎపిక్ వార్ ఫీల్ కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ , ఓపెనింగ్ గ్లింప్స్ గ్రాండియర్ లుక్ లో కనిపిస్తున్నాయి. ఫుల్ క్లాస్ ఎండ్ మాస్ అప్పీల్ తో ఈ సినిమా రాబోతున్నట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ భరత్ క్రిష్ణమాచారి విజువల్ స్కేల్ కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. బాహబలి, ట్రిపుల్ లాంటి విజువల్ వండర్స్ కి రూపం ఇచ్చిన సెంథిల్ కుమార్ స్వయంభుకి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. దాంతో స్వయంభు మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు నిఖిల్. ఇద్దరి యంగ్ హీరోలకు ఇప్పుడు హిట్ అనేది చాలా కీలకం. మరి ఈ రెండు సినిమాలు ఈ హీరోలకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
