Site icon NTV Telugu

Tragedy: విషాదం.. హంసలదీవి బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు గల్లంతు

Tragedy

Tragedy

Tragedy: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్‌ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మరో ముగ్గురు సముద్రం నీరు తాగేయడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళను షేక్‌ ఫజల(26)గా గుర్తించారు. గల్లంతైన వ్యక్తిని ముషారఫ్ (20)గా గుర్తించారు. ఈరోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వారు విహారయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతయిన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాపాడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Read Also: Women Harassment: దేశంలో ప్రతీగంటకు నలుగురు మహిళలపై అత్యాచారం..

Exit mobile version