NTV Telugu Site icon

Crime News: నుదుటిపై తిలకం చూసి హత్య.. ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష

Nia

Nia

కాన్పూర్‌లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్‌లకు మరణశిక్ష విధించింది. విచారణలో ఉపాధ్యాయుడిపై పిస్టల్ తో కాల్చి హత్య చేసినట్లు రుజువైంది. చేతికి కంకణం, నుదుటిపై తిలకం ఉండటంతో.. హిందూ గుర్తింపుగా భావించి హత్య చేశారు. ISIS జిహాదీ ఆలోచనను చూపించడానికి ఈ హత్య జరిగింది.

Read Also: Minister Roja: టీడీపీ-జనసేన పొత్తు.. మంత్రి రోజా షాకింగ్‌ కామెంట్స్‌..

మరోవైపు అతిఫ్ ముజఫర్, ఫైసల్‌లకు ఇప్పటికే మరొక కేసులో మరణశిక్ష విధించారు. ఏటీఎస్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైఫుల్లా హతమయ్యాడు. ఇదిలా ఉంటే.. సోమవారం NIA కోర్టు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగర్‌లో నివసిస్తున్న నిందితుడు అతిఫ్ ముజఫర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 34, 120B సెక్షన్ 302, సెక్షన్ 16(1)(A), UA(P)లోని 18 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసింది. మహ్మద్ ఫైసల్ ఖాన్ పై సెక్షన్ 3, 25, 27 కింద కేసు నమోదు చేసి దోషిగా నిర్ధారించారు.

Read Also: Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..

నిందితులిద్దరిపై 2018 జూలై 12న చార్జిషీటు దాఖలు చేశారు. అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైసల్ ఖాన్‌లు ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్ర మద్దతుదారులని ఈ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. వారి ఏకైక లక్ష్యం ప్రజలను చంపడం, ఇతర మతాల ప్రజలను అవిశ్వాసులుగా పరిగణించడం. 2017 మార్చి 7న మూడవ నిందితుడు మహ్మద్ సైఫుల్లా ATS UPతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. 2016న కాన్పూర్‌లోని ప్యోండి గ్రామంలో పిస్టల్‌ పనిచేస్తుందా లేదా అని తనిఖీ చేసేందుకు ఉగ్రవాదులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్ బాబు శుక్లాపై కాల్పులు జరిపారు. ముస్లిమేతరులపై తీవ్రవాద హింసాకాండకు పాల్పడి వారిని చంపి తమ ఛాందసవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం.